ఏమో మరి!!!

10:41 Posted In Edit This 0 Comments »


"ఏదో మరచిన భావన....
 ఇంకా దేనికోసమో అన్వేషణ..!!!
 ఇదే మరి!!! ప్రేమికుల విరహవేదన....."


ప్రేమ కాదు!

06:14 Posted In Edit This 0 Comments »


కాలం మారింది....
ప్రేమ అర్థమూ మారింది!!!
ప్రేయసి కళ్ళలో రాలే కన్నీటిని చూసి,
ప్రేమని బ్రమించేలా ప్రేమ అర్థాన్ని మార్చేస్తున్నారు!
ప్రేమ బాధల్ని దూరం చేయాలి,
మనసుని తేలిక చేయాలి,
జీవితంలో క్రొత్త సంతోషాల్ని నింపాలి,
బ్రతుకుపై అశని కల్గించాలి ,
ప్రేమకు ప్రేమించటమే తెలుసు.
ద్వేషించేదీ ప్రేమ కాదు.................!!!

Love is Great...

05:21 Posted In Edit This 1 Comment »


ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది.
అంతేనా!
ప్రేమ అమాయకత్వాన్నీ ప్రేమిస్తుంది,
ద్వేషాన్నీ ప్రేమిస్తుంది,
అహాన్నీ ప్రేమిస్తుంది,
మంచిని ప్రేమిస్తుంది,
మంచి మనసునీ ప్రేమిస్తుంది,
మనసుల్ని దగ్గర చేసే ప్రతి అంశాన్నీ ప్రేమిస్తుంది.
ప్రేమకు ప్రేమించటమే తెలుసు.
మరణానైనా చిరునవ్వుతో అందుకోగల ధైర్యం ప్రేమకుంది!

తికమక! మకతిక!

10:28 Posted In Edit This 0 Comments »



ప్రేమంటే?
ప్రే- అంటే ప్రేమించటం,
మ- అంటే మరణం వరకూ కలసి వుండటం.


ఫ్రేమంటే?
రెండు మనసులను కలిపే అదృశ్య శక్తి.


ప్రేమంటే?
మనసులో పుట్టి,మనసుతో కలిసి,మనసులే మాట్లాడే..
ప్రేమికుల భాష.


ప్రేమంటే?
కష్టాలలో వెన్నంటి ఉండే ఆత్మీయ బాసట.


ప్రేమంటే?
********
మనసుకో అనుభూతి!
ప్రేమించే ప్రతి మనసుదీ తన్మయ స్థితి!
కనుక,
ప్రేమంటే?
అనంత సూత్రాల ప్రాతిపథిక!
ఎవ్వరికీ...
ఎప్పటికీ...
అర్థంకాని...
తికమక! మకతిక!


వయస్సు

09:58 Posted In Edit This 1 Comment »



ఈ వయసేంటి ఇంత అమాయకమైంది!
చిన్న నవ్వుకే మురిసిపోతుంది,
నువ్వు బావున్నావు...అనగానే,
బాధలన్నింటినీ మరచిపోతుంది!
నన్ను నన్నుగా సరిగా అంచనావేయలేని పిచ్చిమొద్దు,
నిన్ను అంచనా వేయగలనంటూ నన్ను మభ్యపెడుతుంది.
నీకున్న సవాలక్ష అవలక్షణాలను,
మార్చగలనన్న నమ్మకాన్ని ఏధైర్యంతో ఇస్తుంది? 
నిన్ను ప్రేమిస్తాను..
ఎంతలా అంటే ఊహించనంత!
మరి నిన్ను అంతలా ప్రేమిస్తున్నానంటే..
నా లక్ష్యాలను నిర్లక్ష్యం చేసినట్లేగా..
నా స్నేహితుల్ని,
నా తల్లిదండ్రులని,
వారి నమ్మకాన్ని,
వారి ప్రేమను,
వారి కలలను,
నిర్లక్ష్యం చేసినట్లేగా...
అన్నీ తెలిసీ తెలియనట్లు ఎంధుకు భ్రమిస్తున్నాను?
....
....
....
భ్రమలో బ్రతుకుతూ ప్రేమనుకునే ఈ వయసు..
ఎన్నాళ్ళని వెంటాడుతుందో!




(దయచేసి ఇది నా ప్రేమని మాత్రం చదివిన వాళ్ళు భ్రమించకండి :):):) )   

ప్రేమంటే ఇదేరా!

10:59 Posted In Edit This 0 Comments »



ప్రేమంటే Confusion,
దగ్గరున్నప్పుడు తెలియదు,
దూరమౌతున్నప్పుడు అర్థం కాదు,
కోరుకున్నప్పుడు దూరమౌతుంది,
దూరమయ్యేప్పుడు దగ్గరవ్వాలని ఆరాటపడుతుంది,
...
...
...
ప్రేమికుల మధ్య ఇలా ఏర్పడే ఎడబాటు,
వారు దగ్గరుంటే బావుంటుందని,
మనసు పదే పదే గుర్తుచేస్తూ ఉంటుంది.
అదే లో Love లో వున్న Speciality.
దూరమవ్వటం లోనూ దగ్గరిదారిని చూపిస్తుంది...


నిరీక్షణ

23:29 Posted In Edit This 1 Comment »


"చివురించిన ప్రతి రెమ్మకు,
 చిరునవ్వులు లేవెందుకు?
 పరవశించు ప్రతి చినుకూ,
 పువ్వులపై చేరవెందుకు?
 ఎగసిన ఆ అల సవ్వడి,
 తన పరిధి దాటి ప్రతిధ్వనించదెందుకు?
 ఆకలి దప్పుల మాటున,
 అలసిన మనసుల మధ్యన,
 అనురాగం పెనవేసుకున్న,
 ఆత్మీయతలు చూడగలమా???


 స్నేహపు సుమగంథంలో,
 విలువెరిగిన ఓదార్పులు,
 కలకాలం వాడిపోక,
 పరిమళాలు వెదజల్లే,
 సంజీవని పుష్పాలై...
 చిరునవ్వులు చిందిస్తూ,
 పదుగురినీ పలకరించు,
 పైరగాలై సాగిపోవు,
 అద్బుతాన్ని ఆవిష్కరించగలమా?????
  
 ప్రతి తలపులో ప్రశ్న!
 తెలుసుకునేందుకే నా నిరీక్షణ......." 

143

11:03 Posted In Edit This 0 Comments »




I LOVE YOU అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని,
అంతేనా!
నిన్నే ఆరాధిస్తున్నానని,
జీవితాంతం నీతోడై ఉంటానని,
నా సర్వస్వం నీవేనని,
నీవు దూరమైనా నీ జ్ఞాపకాలలో,
సమిథలా మిగిలిపోతానని,
ఇలా అర్థాలను  'I LOVE YOU ' అన్న పదం నుండి ఆశిస్తారు,
జీవితానికి భరోసా ఇచ్చే ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమకోసం,
పెద్దలనైనా ఎదురించేందుకు సిద్దపడుతారు!
అందుకే,
ఈ ప్రేమలో ఎందరో పావులుగా మారి బలైపోయినా,
నిజమైన ప్రేమకోసం వసంతం కోసం ఎదురుచూసే కోయిలలా...
ప్రతిమనసూ ప్రేమించాలని ఉవ్విళ్ళూరుతుంది.

అభిలాష

08:20 Posted In Edit This 0 Comments »


నడిచే నా పాదాలకు దిశ నీవే,
చూసే నా కనులకు చూపు నీవే,
నిద్రలో నే కనే కలలకు ఆధారం నీవే,
నే వ్రాసే ప్రతి పదానికీ అర్థం నీవే,
అందుకే.....
నీవే నా శ్వాస,
నీవే నా ధ్యాస,
నీవెప్పటికీ నాతో వుండాలన్నదే నా అభిలాష..