ప్రేమ కాదు!
06:14 Posted In Love Hurts Edit This 0 Comments »కాలం మారింది....
ప్రేమ అర్థమూ మారింది!!!
ప్రేయసి కళ్ళలో రాలే కన్నీటిని చూసి,
ప్రేమని బ్రమించేలా ప్రేమ అర్థాన్ని మార్చేస్తున్నారు!
ప్రేమ బాధల్ని దూరం చేయాలి,
మనసుని తేలిక చేయాలి,
జీవితంలో క్రొత్త సంతోషాల్ని నింపాలి,
బ్రతుకుపై అశని కల్గించాలి ,
ప్రేమకు ప్రేమించటమే తెలుసు.
ద్వేషించేదీ ప్రేమ కాదు.................!!!
తికమక! మకతిక!
10:28 Posted In LOVE Edit This 0 Comments »ప్రేమంటే?
ప్రే- అంటే ప్రేమించటం,
మ- అంటే మరణం వరకూ కలసి వుండటం.
ఫ్రేమంటే?
రెండు మనసులను కలిపే అదృశ్య శక్తి.
ప్రేమంటే?
మనసులో పుట్టి,మనసుతో కలిసి,మనసులే మాట్లాడే..
ప్రేమికుల భాష.
ప్రేమంటే?
కష్టాలలో వెన్నంటి ఉండే ఆత్మీయ బాసట.
ప్రేమంటే?
********
మనసుకో అనుభూతి!
ప్రేమించే ప్రతి మనసుదీ తన్మయ స్థితి!
కనుక,
ప్రేమంటే?
అనంత సూత్రాల ప్రాతిపథిక!
ఎవ్వరికీ...
ఎప్పటికీ...
అర్థంకాని...
తికమక! మకతిక!
వయస్సు
09:58 Posted In LOVE Edit This 1 Comment »ఈ వయసేంటి ఇంత అమాయకమైంది!
చిన్న నవ్వుకే మురిసిపోతుంది,
నువ్వు బావున్నావు...అనగానే,
బాధలన్నింటినీ మరచిపోతుంది!
నన్ను నన్నుగా సరిగా అంచనావేయలేని పిచ్చిమొద్దు,
నిన్ను అంచనా వేయగలనంటూ నన్ను మభ్యపెడుతుంది.
నీకున్న సవాలక్ష అవలక్షణాలను,
మార్చగలనన్న నమ్మకాన్ని ఏధైర్యంతో ఇస్తుంది?
నిన్ను ప్రేమిస్తాను..
ఎంతలా అంటే ఊహించనంత!
మరి నిన్ను అంతలా ప్రేమిస్తున్నానంటే..
నా లక్ష్యాలను నిర్లక్ష్యం చేసినట్లేగా..
నా స్నేహితుల్ని,
నా తల్లిదండ్రులని,
వారి నమ్మకాన్ని,
వారి ప్రేమను,
వారి కలలను,
నిర్లక్ష్యం చేసినట్లేగా...
అన్నీ తెలిసీ తెలియనట్లు ఎంధుకు భ్రమిస్తున్నాను?
....
....
....
భ్రమలో బ్రతుకుతూ ప్రేమనుకునే ఈ వయసు..
ఎన్నాళ్ళని వెంటాడుతుందో!
(దయచేసి ఇది నా ప్రేమని మాత్రం చదివిన వాళ్ళు భ్రమించకండి :):):) )







